మహేష్ సంపాదనలోనూ నంబర్ వన్

మరిన్ని వార్తలు

హిట్ తో సంబంధం లేకుండా వసూళ్లు  రాబట్టే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబే. గుంటూరుకారం మూవీతో సంక్రాతి బరిలో నిలిచి,  యావరేజ్ టాక్ తో కూడా 100  కోట్లు కలక్షన్స్ రాబట్టాడు.  ఓవర్సీస్ లో కూడా వసూల్ చేసి ఓవర్సీస్ హీరో అనిపించుకున్నాడు  మహేష్. అంతే కాకుండా  ఇంకోసారి కమర్షియల్ హీరో ముద్రను  కూడా  కాపాడుకున్నాడు.  సినిమా రంగం లో సూపర్ స్టార్ గా కొనసాగుతూ, నిర్మాతలకి మంచి లాభాలు అందించే మహేష్ , బిజినెస్ రంగంలో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.


టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోలలో మహేష్ ఒకరు. గుటూరుకారం మూవీ తరవాత మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ ఆస్తుల విలువ వేల కోట్లకు చేరుకుందని సమాచారం.  జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉంది మహేష్ కి . ఇంకా  హైదరాబాదులోని గచ్చిబౌలిలో సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్ , ఏ ఎం బి సినిమాస్ కూడా ఉన్నాయి. రెయిన్బో ఆస్పత్రులకు గుడ్ విల్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. యాడ్స్ ద్వారా కూడా బానే సంపాదిస్తున్నాడు  మహేష్. ప్రజంట్ 50 యాడ్స్ చేస్తున్నాడు. ఒక్కో యాడ్ కి 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే ఒక్కో సినిమాకి  80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.


రియల్ ఎస్టేట్, ఆసుపత్రి ఇతర వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. హైదరాబాదులో ఉన్న మహేష్ ఇల్లు 40 కోట్లు. ఇలా మహేష్ సంపాదన అంతా కలిసి మొత్తంగా 13 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. కేవలం సంపాదన మాత్రమే కాదు సమాజనికి తన వంతుగా ఎదో ఒకటి చేయాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఒక వైపు సినిమాలు , మరో వైపు బిజినెస్, ఇంకోవైపు సామాజిక కార్యక్రమాలు, యాడ్స్ అంటూ ఎప్పుడు బిజీగా ఉండే మహేష్,  వేలమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS