సినిమాల నుండి రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ లో భాగంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ఎంట్రీ డిసెంబర్ లో ఉండొచ్చు అనే ఊహాగానాల నడుమ మరో సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ పై రూమర్స్ మొదలయ్యాయి.
వివరాల్లోకి వెళితే, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అని పుకార్లు వచ్చాయి. అయితే ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని, తనకి సినిమాల్లోనే నటించాలని ఉంది అని చెప్పి తన పై వస్తున్న రాజకీయ పుకార్లకీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
ఇలాంటి పుకారే ఈమధ్య కింగ్ నాగార్జున పైన కూడా రావడం జరిగింది. ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరనున్నట్టు బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చేశాయి. అయితే వీటి పైన నాగార్జున స్పందించలేదు.