ముద్దుగుమ్మ సురభి ధనుష్ నటించిన 'రఘువరన్ బీటెక్' సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించి మెప్పించింది. భలే క్యూట్‌గా ఉందే ఈ బ్యూటీ అనిపించింది. 'బీరువా'తో తెలుగులో తెరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా విజయం సాధించకపోవడంతో అమ్మడు పెద్దగా రిజిస్టర్ కాలేదు. తర్వాత 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాలో శర్వానంద్‌కి జోడీగా నటించింది. సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు పాపులర్ హీరోయిన్ అనిపించుకుంది. తర్వాత నాని హీరోగా తెరకెక్కిన 'జెంటిల్మెన్' సినిమాతో ఫామ్‌లోకి వచ్చేసింది. అందంలో కుందనపు బొమ్మ. యాక్టింగ్‌లో కొంచెం వీక్ అయినా కానీ అందంతో నెట్టుకొచ్చేస్తోంది. ట్రెడిషనల్ వేర్ అయినా, మోడ్రన్ వేర్ అయినా ఇట్టే సూటయిపోతుంది ఈ బ్యూటీకి. 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాలోనే చిట్టి పొట్టి గౌనులేసి కుర్రోళ్ల గుండెల్ని కొల్లగొట్టేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ చేస్తున్న తాజా చిత్రం అల్లు వారబ్బాయితో. అల్లు శిరీష్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో అమ్మడు హాట్ హాట్ అందాలే మెయిన్ అట్రాక్షన్ కానున్నాయట. అమ్మడు శృతి మించిన గ్లామర్ ప్రదర్శించేసిందట ఈ సినిమాలో. ఈ సినిమాలో సురభితో పాటు అనుపమా పరమేశ్వరన్ కూడా నటిస్తోంది. కానీ అనుపమ నుంచి పెద్దగా గ్లామర్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో సురభి మాత్రం కెవ్వు కేక పెట్టించేయనుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సో హాట్ అండ్ క్యూటీ సురభి అందాల దాడి చూడాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే!