సూర్య తాజా చిత్రం గ్యాంగ్ విడుదలకి సిద్ధంగా ఉన్న సమయంలో ఓ వివాదంలో చిక్కుకున్నది.
ఆ వివాదమేంటంటే- గ్యాంగ్ చిత్రం తమిళ వెర్షన్ లో (తానా సెరెందా కూటమ్) ఉన్న సోడక్కు పాటలోని సాహిత్యం అభ్యంతరకరంగా ఉందంటూ తమిళనాడులోని AIADMK పార్టీకి చెందిన సతీష్ కుమార్ అనే ఒక వ్యక్తి పోలీసులని ఆశ్రయించాడు. ఆ పాటలోని కొన్ని పదాలు తమ పార్టీ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇక ఇదే వివాదం పైన నిర్మాత జ్ఞానవేల్ రాజా స్పందిస్తూ పోలిసుల నుండి తమకి ఎటువంటి సమాచారం లేదు అని కేవలం మీడియా ద్వారానే ఈ విషయం తమకి తెలిసింది అని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఇలాంటి సంఘటనల వల్ల తమ చిత్రానికే ఫ్రీ పబ్లిసిటీ అందుతుంది అని చమత్కరించారు.
మరి ఈ వివాదం ఎటువంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.