కంగువాతో తెలుగు సినిమాలకు ఇబ్బందేనా??

మరిన్ని వార్తలు

ఈ దీపావ‌ళికి బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఇదే సంద‌డి నవంబర్ 14న క‌నిపించ‌నుంది. వరుణ్ తేజ్ మట్కాతో వస్తున్నారు. దాంతో పాటు కంగువా, దేవ‌కీ నంద‌న వాసుదేవ చిత్రాలు వ‌స్తున్నాయి. వ‌రుణ్ కెరీర్లో కాస్ట్లీ సినిమా... మ‌ట్కా. పలాస ఫేం కరుణ్ కుమార్ డైరెక్టర్. లేటెస్ట్ గా వదిలిన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్, వింటేజ్ బ్యాక్ డ్రాప్, డైలాగులు, యాక్షన్ ఇవన్నీ క్యాచీగా ఉన్నాయి.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది. సూర్య 'కంగువా' సినిమాతో వస్తున్నాడు. చాలా పెద్ద సినిమా ఇది. ఈ సినిమా కోసం చాలాకాలంగా సూర్య ఫ్యాన్స్, సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా సినిమా చూడాలనే ఆసక్తి కలిగించేలా ట్రైలర్ కట్ చేశారు.

సూర్య సినిమా కావడంతో రికార్డు స్థాయిలో తెలుగులో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పైగా సూర్య 15 రోజులకు ముందే ఇక్కడ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. నిజానికి తెలుగు సినిమాలకు తమిళ సీమ‌లో అనుకున్నంత థియేటర్స్ దొరకడం లేదు. దానికి 'క‌' ఓ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఈ దీపావ‌ళికి విడుద‌లైన 'క‌' తెలుగులో మంచి టాక్ తెచ్చుకొంది. అయితే త‌మిళంలో ఈ చిత్రానికి థియేట‌ర్లు ఇవ్వ‌లేదు. కానీ త‌మిళం నుంచి వ‌చ్చిన 'అమ‌ర‌న్‌'కు తెలుగులో థియేట‌ర్లు ఇచ్చారు. 'అమ‌ర‌న్‌' వ‌ల్ల తెలుగు చిత్రాల వ‌సూళ్ల‌కు గండి ప‌డింది. ఇప్పుడు 'కంగువా' కూడా అదే క్రేజ్ తో విడుదల కానుంది. ఖచ్చితంగా కంగువా ఎఫెక్ట్ 'మట్కా', 'దేవ‌కీ నంద‌న వాసుదేవ' చిత్రాల‌ పై ఉంటుందనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS