దాదాపు తొమ్మిదేళ్ల తరవాత రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు చిరంజీవి. ఖైది నెం 150 సరిగ్గా 150 కోట్లు సాధించి - అప్పటి నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసింది. ఇప్పుడు సైరాకి అంతకు మించిన క్రేజ్ వచ్చేసింది. చిరు 151వ చిత్రమిది. `ఖైది నెం 150`కి మించిన రికార్డులు వసూలు చేయాలన్న ధ్యేయంతో ఈ సినిమాపై భారీగా ఖర్చు పెడుతున్నారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరుగుతోంది. ఈ సినిమా నైజాం హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోయాయని టాక్. ప్రముఖ కథానాయకుడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పంపిణీదారుడు కూడా. ఆయనే చరణ్ ముందు ఈ ఆఫర్ తీసుకెళ్లారని సమాచారం. నైజాంలో అగ్ర కథానాయకుడి చిత్రమంటే దాదాపుగా 16 నుంచి 20 కోట్లు పలుకుతుంది. దాన్ని సైరా క్రాస్ చేసిందన్నమాట. చిరంజీవి స్టామినాకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?