'నామ్ షబానా', పింక్' వంటి చిత్రాలతో బాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి పెట్టింది పేరుగా మారిపోయింది ముద్దుగుమ్మ తాప్సీ. ఈ సినిమాలు బాలీవుడ్లో తాప్సీకి మంచి పేరు తీసుకొచ్చాయి. అమ్మడు తెలుగులోనే తన సినీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ, తెలుగులో కేవలం గ్లామర్ డాళ్‌గానే గుర్తింపు తెచ్చుకోగల్గింది. హిందీలో అడుగుపెట్టాకే, తనలోని నటికి పని చెప్పే అవకాశం కల్గింది తాప్సీకి. అందుకే సౌత్ ఇండస్ట్రీ తనను అందాల బొమ్మగానే చూస్తే, హిందీ పరిశ్రమ తన టాలెంట్‌ని గుర్తించింది అంటూ తాప్సీ ఆ మధ్య వ్యాఖ్యానించింది కూడా. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోనూ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 'నామ్ షబానా' సినిమా 'నా పేరు షబానా' పేరుతో తెలుగులోనూ విడుదలయ్యింది. అయితే ఈ సినిమాలతో తాప్సీ యాక్షన్ గాళ్‌గా అలరించింది. తాజాగా తాప్సీ తెలుగులో 'ఆనందో బ్రహ్మ' అనే సినిమాతో మన ముందకు రాబోతోంది. ఇదో హారర్ కామెడీ చిత్రం. హారర్ కామెడీ చిత్రాలు ఎన్నొస్తున్నా, వాటికి క్రేజ్ తగ్గడం లేదు. అయితే వాటన్నింటికీ భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందంటోంది తాప్సీ. ఈ సినిమాలో తాప్సీదే మెయిన్ రోల్. కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా నిండా ఇంకా చాలా మంది కమెడియన్లున్నారు. వీళ్లు పండించే కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయయట. అంతేకాదు ఇంతవరకూ దయ్యాన్ని చూస్తేనే మనుషులు భయపడ్డారు. మనిషిన చూసి దయ్యం భయపడితే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులోంచి పుట్టే వినోదం ఆధ్యంతం నవ్వులు పూయిస్తుందట. త్వరలోనే ఈ సినిమా