'ఒక్క క్షణం' నన్ను మర్చిపోవద్దు - తాప్సీ

మరిన్ని వార్తలు

అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఒక్క క్షణం'. ఫస్ట్‌లుక్‌తోనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాడంటే, తాజాగా వచ్చిన టీజర్‌తో మరింత ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాడు అల్లు వారబ్బాయి. టీజర్‌లో ఇంట్రెస్ట్‌ అంశాన్ని జోడించారు. అంటే సినిమా కాన్సెప్ట్‌ ఇంకెంత ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోందో. మామూలు కమర్షియల్‌ సినిమా కాన్సెప్ట్‌లా అనిపించడం లేదు. డైరెక్టర్‌ వి.ఐ ఆనంద్‌ సినిమాల్లో కాన్సెప్ట్‌ కొత్తగా ఉంటుంది. 

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అంటూ యంగ్‌ హీరో నిఖిల్‌కి హిట్‌ ఇచ్చాడు ఈ డైరెక్టర్‌. ఇప్పుడు అల్లు శిరీష్‌ కూడా హిట్‌ కొట్టేలానే కనిపిస్తున్నాడు. హిట్‌ కళ కనిపిస్తోంది సినిమాకి టీజర్‌ వచ్చాక. 'శ్రీరస్తు శుభమస్తు' అంటూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో సక్సెస్‌ అందుకున్న అల్లు శిరీష్‌ ఈ సినిమాతోనూ మరో హిట్‌ తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోతున్నట్లే. టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సురభి, సీరత్‌ కపూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరు ముద్దుగుమ్మలు గ్లామర్‌లో పోటీగా కనిపిస్తున్నారు.. శిరీష్‌ మునుపటి కన్నా హ్యాండ్‌సమ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు టీజర్‌లో. టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

కాగా ఈ టీజర్‌ని ముద్దుగుమ్మ తాప్సీ వీక్షించిందట. చాలా నచ్చేసిందట తాప్సీకి. తాజాగా సోషల్‌ మీడియాలో 'ఒక్క క్షణం' టీజర్‌పై తాప్సీ స్పందించింది. సినిమా ప్రివ్యూ షో వేసేటప్పుడు తనని పిలవడం మర్చిపోవద్దని చిత్ర యూనిట్‌కి తాప్సీ చెబుతోంది. అంత బాగా టీజర్‌ నచ్చేసిందట తాప్సీకి. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా? అని ఆడియన్స్‌ కన్నా ఎక్కువ క్యూరియాసిటీతో ఉన్నానంటోంది బ్యూటీ తాప్సీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS