దసరా పండగ సీజన్ అంటేనే పెద్ద సినిమాల విడుదలతో అది మరొక సినిమా పండగలా మారిపోతది. అలాగే ఈ వారం కూడా రెండు రోజుల వ్యవధిలో రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చూపెట్టాయి.
ఇక మొదటిగా విడుదలైన మహేష్ స్పైడర్ చిత్రం 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా టాక్ విషయానికి వస్తే, దర్శకుడు చెప్పాలనుకున్న అంశం మంచిదే అయినప్పతట్టికి ఆయన చెప్పిన విధానంలో లోపాల వల్ల ఈ చిత్రానికి మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ రావడం మొదలయింది.
ఈ చిత్రం పైన మహేష్ తో పాటుగా ఆయన అభిమానులు సైతం చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే రిజల్ట్ మాత్రం తాము అన్నుకున్నదానికి భిన్నంగా రావడంతో ఈ పండగ పూట అందరు నిరాశకి గురయ్యారు.
ఇక ఈ వారంలోనే విడుదలైన రెండవ చిత్రం- మహానుభావుడు. ఈ మహానుభావుడు చిత్రం టీజర్ విడుదల అయినప్పట్టినుండే ప్రేక్షకుల్లో దీని పైన మంచి అభిప్రాయం ఏర్పడింది. ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని చుట్టూ కథ అల్లడంలో నేర్పు సాధించిన దర్శకుడు మారుతి ఈ చిత్రం ద్వారా తన ప్రయత్నంతో సఫలమయ్యాడనే చెప్పాలి.
శర్వానంద్-మెహ్రీనల జంట అలాగే వెన్నెల కిషోర్ పండించిన హాస్యం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు అని ఈ చిత్రం చూసిన వారంతా అభిప్రాయపడుతున్నారు. పండగ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించాలంటే కావాల్సిన అంశాలన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉండడమే ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక మొత్తంగా ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్ లో మహేష్ స్పైడర్ ని వెనక్కి తోసి కుర్ర హీరో శర్వా ‘మహానుభావుడు’ అనిపించుకున్నాడు.