బిగ్‌బాస్ చరిత్రలో తొలి సారి ఓ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని హౌస్‌లోకి పంపించి, కొత్తదనానికి శ్రీకారం చుట్టారు. తమన్నా సింహాద్రి హౌస్ లోపలికి వెళ్లాక, చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు. అందరికీ తెలిసిందే. డే వన్ నుండీ తమన్నా తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె కంచు కంఠతో బిగ్‌బాస్‌కి రావల్సిన టీఆర్‌పీ రేట్లు వచ్చాయో లేదో కానీ, హౌస్ లోపల మాత్రం ఆమె తన ఆటిట్యూడ్‌తో కొన్ని సందర్భాల్లో హద్దులు మీరి ప్రవర్తించింది. హౌస్ మేట్స్‌నీ, ఇటు ఆడియన్స్‌నీ కూడా విసిగించేసింది.
రవి, ఆలీ తదితరుల విషయంలో తమన్నా ప్రవర్తించిన తీరు విస్తుగొలిపేలా చేసింది. హౌస్‌లో జర్నీ చేసిన రెండు వారాల్లో బిగ్‌బాస్‌పై తమన్నా వేసిన ముద్ర ఎలాంటిది అంటే ఆమెకే తెలియాలి. మొదట్లో ఎంతో స్ట్రాంగ్‌గా అనిపించిన తమన్నా, తర్వాతర్వాత కంట్రోల్స్ తప్పింది. హద్దులు మీరి ప్రవర్తించింది. దాంతో, ఆడియన్స్ నుండి వచ్చిన నెగిటివిటీతో, ఇక ఆమెను తట్టుకోవడం కష్టమే అని రెండు వారాల తర్వాత హౌస్ నుండి తమన్నాని బయటికి పంపించేశారు. బిగ్‌బాస్‌కి వెళ్లాలన్నది తన చిరకాల కోరిక అని హౌస్ నుండి బయటికి వచ్చిన తమన్నా చెప్పింది. బయటికి వచ్చాక హౌస్ మేట్స్‌ని ఒక్కొక్కరుగా ఓ ఆట ఆడేసుకుంది స్టేజ్‌పై తమన్నా.