ఎఫ్ 3 ప్రమోషన్లు చాలా జోరుగా సాగాయి. సినిమా రిలీజ్ అయ్యాక కూడా... ప్రమోషన్లు ఆగడం లేదు. ఈ భారీ ప్రచారం ఎఫ్ 3 హిట్ కి బాగా దోహదం చేసింది. అయితే... ఈ ప్రమోషన్లలో తమన్నా పెద్దగా కనిపించలేదు. ఒకట్రెండు ఈవెంట్లకు హాజరవ్వడం మినహా చేసిందేం లేదు. సాధారణంగా, హీరోయిన్లకు హిట్లు దొరకడమే గగనం. అందుకే సినిమా హిట్టయితే... ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ తమన్నా అది కూడా చేయలేదు.
ఈ సినిమా షూటింగ్లో తమన్నాకీ, అనిల్ రావిపూడికీ మధ్య ఏవో ఈగో క్లాష్లు వచ్చాయని, అందుకే తమన్నా పబ్లిసిటీకి డుమ్మా కొట్టిందని వార్తలొచ్చాయి. వాటిపై ఎట్టకేలకు అనిల్ రావిపూడి స్పందించారు. ''సెట్లో చిన్నా చితకా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ తరవాత వెంటనే సర్దుకుపోతాయి. నేను వాటి గురించి పట్టించుకోను. నాకు సినిమానే ప్రధానం. సినిమా తరవాతే ఎవరైనా. సినిమాక ఓసం నేను ఈగోల్ని కూడా పక్కన పెట్టేసే రకం. అయినా ఒకట్రెండు ఈవెంట్లకు తమన్నా వచ్చింది. తను హిందీలో ఫుల్ బిజీగా ఉంది. కాన్స్ కి కూడా వెళ్లింది. అందుకే ప్రమోషన్లకు రాలేదు'' అని క్లారిటీ ఇచ్చేశారు.