మిల్కీబ్యూటీ మెగా కోరిక తీరుతోందిలా.!

మరిన్ని వార్తలు

'రచ్చ' సినిమా టైంలో తమన్నా, తనకి చిరంజీవితో కలిసి నటించాలనుందని చెప్పింది. అయితే అప్పుడు చిరంజీవి పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇకపై ఎలాగూ సినిమాల్లో నటించే ఆలోచన అప్పటికి లేని చిరంజీవి అదే వేదికపై తమన్నా మాటలకు కొంత పెప్‌ యాడ్‌ చేశారు. నాకు కూడా తమన్నాతో కలిసి నటించాలని ఉందని, తమన్నా డాన్సులు చాలా బాగుంటాయని అన్నారు. అయితే అప్పుడు ఆ మాటలకు ఎవరైనా తథాస్తు అన్నారేమో. 

ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో తమన్నా ఓ పాత్రలో కనిపించే ఛాన్స్‌ కొట్టేసింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటనేది ఇంకా తెలీదు కానీ, 'బాహుబలి'లో తమన్నా అవంతికా రాజకుమారిగా అందాలొలికే పాత్ర పోషించింది. అందాల భామే కానీ, పోరాట యోధురాలిగా ఎక్కువ భాగం కనిపిస్తుంది ఆ సినిమాలో. ఇప్పుడు ఆ పోరాట యోధురాలి పాత్రలోనే చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో కూడా తమన్నా నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఎలాగైతేనేం చిరంజీవితో కలిసి నటించాలనేదే తమన్నా కోరిక. ఆ కోరిక ఇప్పుడు ఇలా తీరబోతున్నందుకు తమన్నా ఆనందానికి అవధుల్లేవట. 

నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని రామ్‌చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS