మిల్కీ బ్యూటీ తమన్నా 'జై లవకుశ'లో ఐటెం సాంగ్‌కి చిందేసింది. 'స్వింగ్ జరా..' అంటూ సాగే ఈ పాట టీజర్‌ని ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఐటెం సాంగ్స్‌కి ఆడి పాడింది ముద్దుగుమ్మ తమన్నా. స్టార్ హీరోయిన్‌గా ఉన్న టైంలోనే తమన్నా స్పెషల్ సాంగ్స్‌కి సై అన్నది. తొలి సారిగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'అల్లుడు శీను' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌కిగానూ మిల్కీ బ్యూటీ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌తోనే ఆడి పాడింది 'స్పీడున్నోడు'లో. తర్వాత కన్నడ సినిమా 'జాగ్వార్' కోసం మళ్లీ ఐటెం గాళ్ అవతారమెత్తింది. 'బాహుబలి' సినిమా తర్వాత తమన్నా చేయబోతున్న సినిమా ఇదే. ఈ పాటకు దేవిశ్రీ మ్యూజిక్ సంగీతంలో అదిరిపోయే బీట్స్‌తో తమన్నా హాట్ హాట్ స్టెప్స్‌తో దుమ్ము దులిపేసిందట. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నా, ఎన్టీఆర్‌తో జత కట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు ఐటెం సాంగ్ ద్వారా ఎన్టీఆర్‌తో ఆడి పాడుతోంది తమన్నా. ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణ్‌రామ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.