‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రయాణంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదమైన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారని ఆయన చేసిన ఓ కామెంట్ ఈ వివాదానికి కారణం.. దీనిపై చాలా మంది మండిపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలపై తాజాగా తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.
‘‘గత వారం ఒక సెమినార్ జరిగింది. ఈ మాటల సందర్భంలోనే ‘RRR’ గురించి ప్రస్తావన వచ్చి ‘అవార్డు వస్తుందా’ అని విద్యార్థులు అడిగారు. మాటల్లో దాని గురించి చెబుతూ ‘ఆర్ఆర్ఆర్‌కు అంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది. ఇప్పుడు ఆస్కార్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ డబ్బుతో ఎక్కువ సినిమాలు తీయొచ్చు’ అని మాత్రమే చెప్పా. రెండున్నర గంటల పాటు సినిమాల గురించి మాట్లాడితే, అది వదిలేసి, నిమిషం ఉన్న క్లిప్‌ను తీసుకుని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడారు. నేను కూడా అలాగే రియాక్ట్ అవ్వవచ్చు. కానీ, నాకు సంస్కారం ఉంది’’ అన్నారు
‘’దేశానికి గౌరవాన్ని తెస్తున్న రాజమౌళిని అభినందించాలి’ అని మూడు రోజుల క్రితం ట్వీట్ పెట్టా’ మనకు ఆస్కార్ అనేది ఆలోచనలో లేని విషయం. అలాంటిది ఇప్పుడు 99శాతం అవార్డు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇది మనం అందరం గర్వపడే విషయం. ఈ వివాదాన్ని ఇంకా కొనసాగిం చాలని నాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు.