జల్లికట్టు ఉధ్యమం నుండి పొందిన స్పూర్తో ఏమో తెలీదు కాని గత 24 గంటల నుండి ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలి అనే పిలుపులు సూచనలు జోరందుకున్నాయి.
అలాంటి వాటిల్లోనే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ తన యుట్యూబ్ ఛానల్ ద్వారా ఈనెల 26న జరగబోయే మౌన దీక్షకి తన సంపూర్ణ మద్దతు తెలిపాడు. అలాగే తను కూడా స్వయంగా ఆరోజు జరిగే దీక్షలో పాల్గొంటానని స్పష్టంచేశాడు. అలాగే తన వీడియో సందేశంలో ప్రతి ఒక్క హీరో తమ తమ అభిమానులకి ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనమని సూచన చేసాడు.
ఆల్రెడీ పవన్ సంపూర్ణ మద్దతు తెలపడంతో ఆయనను మెగా హీరోలు సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ కూడా తమ సంఘీభావం ప్రకటించారు. మరి తమ్మారెడ్డి పిలుపు మేరకు ఎంతమంది హీరోలు ముందుకి వస్తారో చూడాలి.