Taraka Ratna: తారకరత్నకు ఎలా వుంది..?

మరిన్ని వార్తలు

తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కోసం కుప్పం వచ్చారు తారకరత్న. పాదయాత్రలో నడుస్తున్న సమయంలో హఠాత్తుగా తూలిపోయారు. వెంటనే వాలంటీర్లు ఆయనను అందుబాటులో ఉన్న కారులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయనకు పల్స్ పడిపోయిది. శరీరం బ్లూ కలర్‌లోకి మారిపోయింది. గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో వైద్యులు సీపీఆర్ చేశారు. మెరుగైన వసతులు ఉన్న పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

 

తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం తారకరత్న బీపీ 120/80 చూపిస్తుంది. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయింది. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మిగతా పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందించారు. తారకరత్న ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఎయిర్‌ లిఫ్ట్‌ లేదా అంబులెన్సా అని ఆలోచిస్తున్నాం. బెంగళూరు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని బాలకృష్ణ వెల్లడించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS