బూతు.. క్లాసిక్ పాట ఖూనీ... ఏంటి రాజా ఇది?!

By iQlikMovies - October 21, 2020 - 19:26 PM IST

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య బూతు సినిమాల జోరు మ‌రీ ఎక్కువ‌వుతోంది. ఓటీటీల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా సినిమాలు తీయాలి అనుకున్నారో, ఏమో... బూతుని య‌దేచ్ఛగా వాడుకుంటున్నారు. అలాంటి చిత్రాల జాబితాలో చేర‌డానికి మ‌రో సినిమా రెడీ అవుతోంది. అదే.. `టెమ్ట్ రాజా`.

 

ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ చూస్తే, సినిమాలో ఏం ఉందో, ఏం ఉండ‌బోతోందో అర్థ‌మైపోతోంది. హీరో న‌గ్నంగా ప‌డుకుని ఉంటాడు.. అటు వైపు ఓ హీరోయిన్‌, ఇటువైపు ఓ హీరోయిన్‌. వాళ్ల చేతులు దుప్ప‌ట్లో దూరి ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ లో `గోపెమ్మ చేతిలో గోరు ముద్ద... రాధ‌మ్మ చేతిలో వెన్న‌ముద్ద‌` పాట వాడుకున్నారు. ఇంత‌కంటే దారుణం ఇంకోటి ఉండ‌ద‌నిపిస్తుంది అది చూస్తుంటే. అస‌లే బూతు సినిమా అని అర్థ‌మైపోతోంది. అందులోనూ ఓ మంచి పాట‌ని ఖూనీ చేయ‌డం అయితే సంగీతాభిమానుల‌కు ఏమాత్రం న‌చ్చ‌దు. `లీకింగ్ సూన్‌` అంటూ క్యాప్ష‌న్ ఒక‌టి. మోష‌న్ పోస్ట‌రే ఇలా ఉందంటే.. సినిమా ఇంకెలా ఉంటుందో? రాంకీ హీరో క‌మ్ డైరెక్ట‌ర్‌. దివ్య రావు, ఆస్మ హీరోయిన్లు. మొత్తానికి కుర్రాళ్ల‌ని టెమ్ట్ చేసుకుని సొమ్ములు చేసుకునే సినిమాలా అనిపిస్తోంది. అందుకే ఆ పేరు పెట్టారేమో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS