సీత తరవాత.. తేజ రెండు కొత్త సినిమాలు ప్రకటించాడు. ఒకటి రానాతో. మరోటి `అలివేలు వేంకటరమణ`. అలివేలు పాత్ర కోసం కాజల్ ని ఎంచుకుంటున్నాడని ప్రచారం జరిగింది. కాజల్ తో తేజకి మంచి బాండింగ్ ఉంది. లక్ష్మీ కల్యాణంతో కాజల్ కి లైఫ్ ఇచ్చింది తేజనే. `నేనే రాజు నేనే మంత్రి`లో కథానాయిక పాత్ర కాజలే చేసింది. ఆమధ్య `సీత`గా కాజల్ నే ఎంచుకున్నాడు. మరోసారి వీళ్ల కాంబినేషన్ కుదరొచ్చని టాక్ వినిపించింది. ఇప్పుడు అలివేలు పాత్ర కోసం తాప్సిని ఎంచుకున్నాడని టాక్.
ఈ సినిమాకి పాన్ ఇండియా లుక్ ఇవ్వాలని తేజ భావిస్తున్నాడట. పాన్ ఇండియా మార్కెట్ ఉన్న తాప్సి నే బెస్ట్ ఆప్షన్ అని, తాప్సిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తాప్సిని కలిసి కథ కూడా వినిపించాడని, తాప్సి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందని సమాచారం. వేంటకరమణ పాత్ర కోసం ముందు గోపీచంద్ ని అనుకున్నా, తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని, ఆ పాత్ర కోసం ఓ బాలీవుడ్ హీరో పేరు పరిశీలిస్తున్నారని టాక్.