'చిత్రం' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన తేజ, వరుసగా 'నువ్వు నేను', 'జయం' తదితర చిత్రాలతో విజయం అందుకున్నాడు. టాలీవుడ్‌లో సెన్సేషన్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే ఈ మధ్య తేజకి చెప్పుకోదగ్గ విజయాలు లేవు. కొత్త వాళ్లతో సినిమాలు తెరకెక్కించడం తేజ ప్రత్యేకత. అయితే ఆ ఫార్ములా ఈ మధ్య తేజకి వర్క్ అవుట్ కావడం లేదు. దాంతో ట్రాక్ మార్చేశాడు. సీనియర్స్‌తోనే సినిమాలకు సై అంటున్నాడు.
ఇటీవలే రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాని తెరకెక్కించాడు తేజ. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత బిగ్ ప్రాజెక్ట్ అయిన 'ఎన్టీఆర్' చిత్రం ఆయన చేతికి వచ్చింది. ఎన్టీఆర్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బాలయ్య నటిస్తూ నిర్మించనున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా తేజ విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమాని ప్రారంభించేశాడు. ఈ రోజే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
తేజ సీనియర్స్‌తోనే ఇకపై సినిమాలు తెరకెక్కించాలనుకుంటున్నాడనడానికి ఇదో నిదర్శనం. వెంకటేష్ ఈ మధ్య మారుతి డైరెక్షన్‌లో వచ్చిన 'బాబు బంగారం' సినిమాతో నిరాశ పరిచినా, 'గురు' చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. తేజ డైరెక్షన్‌లో వచ్చే సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మొత్తానికి తేజ సెకండ్ ఇన్నింగ్స్‌లో అబ్బాయితో ఓ హిట్ అందుకుని, ఆ వెంటనే బాబాయ్ సినిమాని టేకప్ చేశాడు. బాబాయ్‌తో కూడా హిట్ కొడతాడేమో చూడాలి మరి. వెంకీతో సినిమా పూర్తి కాగానే బాలయ్యతో 'ఎన్టీఆర్' చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుందట.