బీచ్‌ బికినీ డబుల్‌ ధమాకా!

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ చాలా చలాకీ పిల్ల. అల్లరి పిల్ల. ఆమె సినిమాల్లో చేసే క్యారెక్టర్స్‌ కూడా అలాంటివే. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. హాట్‌ హాట్‌ ఫోటోలను పోస్ట్‌ చేసి సోషల్‌ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది. అలాగే ఈ హాట్‌ ఫోటోలతో కొత్త వివాదాలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే, హీరోయిన్‌ అనీషా ఆంబ్రోస్‌తో కలిసి చేసిన బీచ్‌ ఎంజాయ్‌మెంట్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బీచ్‌లో బికినీలతో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ హాట్‌ హాట్‌ ఫోటోలతో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి హాట్‌ అప్పీల్‌ విషయంలో ఇద్దరూ పోటీ పడ్డారంటే అతిశయోక్తి కాదు. అయితే వేరే అపార్ధాలు రాకుండా ఫ్రెండ్‌షిప్‌, సిస్టర్స్‌ లవ్‌ అని హ్యాష్‌ టాగ్‌లు కూడా పెట్టిందీ బ్యూటీ. ఏమాటకామాటే చెప్పాలి ఈ ఫోటోలు చాలా హాట్‌గా ఉన్నాయిలే. ఓ హీరోయిన్‌ ఎక్స్‌పోజింగ్‌ అంటేనే వారెవ్వా ఎంత హాట్‌ అంటాం. అలాంటిది ఇద్దరు ముద్దుగుమ్మలు ఇంతలా రెచ్చిపోతే. ఇక డబుల్‌ హాట్‌నెస్సే కాక ఇంకేంటి? మరో వైపు హీరోయిన్‌ ఛాన్సులు వచ్చినట్లే వచ్చి మొహం చాటేశాయి ముద్దుగుమ్మ తేజస్వికి. అనీషా సంగతి కూడా అంతే. మొన్నీ మధ్యనే 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా 'ఒక్కడు మిగిలాడు' సినిమాతో రానుంది. ప్రస్తుతానికి ఇలా తమ హాట్‌ హాట్‌ బికినీల విందును ఆస్వాదించమంటున్నారీ ఇద్దరు ముద్దుగుమ్మలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS