అజిత్ కోలీవుడ్ హీరో అయినా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక్కడ కూడా అజిత్ కి చాలా మంది ఫాలోవర్స్, ఫాన్స్ ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పుకుంటున్నారు కానీ అజిత్ కెరియర్ స్టార్టింగ్ లోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అజిత్ తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. తొలిసారి 'ప్రేమలేఖ' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ప్రత్యేక మైన ఫాన్ బేసిస్ తో తన జర్నీ కొనసాగిస్తున్నాడు.
సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ మంచి ఫ్యామిలీ మెన్ గా గుర్తింపు పొందాడు. ప్రజంట్ అజిత్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఆయన ఫాన్స్ ని ఆందోళనకి గురి చేస్తోంది. అజిత్ తన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ద గా ఉంటారు. జిమ్ లో రెగ్యులర్ గా వర్కౌట్ లు చేస్తూ, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ డైట్ ఫాలౌ అవుతుంటారు. చాలా ఫిట్ గా ఉంటారు. అయినా తరచూ జనరల్ చెకప్ చేయించుకుంటారు. ఎప్పటిలానే ఈ సారి కూడా అజిత్ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో జనరల్ చెకప్ కోసం వెళ్లగా, ఆ టెస్ట్ లో ఒక షాకింగ్ విషయం బయట పడింది.
నార్మల్ గా చేయించుకున్న చెకప్ లో తన బ్రెయిన్ లో ట్యూమర్ ఉందని విషయాన్ని వైద్యులు చెప్పటంతో అజిత్ షాక్ అయ్యారంట. కానీ వెంటనే తేరుకుని సర్జరీ చేయించు కున్నట్లు తెలుస్తోంది. అపోలో హాస్పటల్ డాక్టర్ పెరియగరుప్పన్ టీమ్ 4 గంటలపాటు అజిత్‌కు సర్జరీ చేసి ట్యూమర్ తొలగించారని సమాచారం. ఈ విషయం తెలిసిన ఫాన్స్ అజిత్ తొందరగా కోలుకోవాలని, క్షేమంగా బయటికి రావాలి అంటూ ప్రార్థిస్తున్నారు.