హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా`.. బ్లాక్‌బస్టర్ ఫిలింస్, ఒరిజినల్స్, వెబ్ షోస్‌లతో ఈ వేసవిలో తెలుగు ప్రేక్షకులకు హౌస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ ఏడాదిలో క్రాక్, గాలి సంపత్, నాంది, లెవన్త్ అవర్, మెయిన్, తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాల తర్వాత ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ `థాంక్యూ బ్రదర్` సినిమా `ఆహా`లో మే 7న డైరెక్ట్‌గా రిలీజ్ అవుతుంది.
అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. ఈ చిత్రాన్ని రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి నిర్మించారు. ఓ యువకుడు, గర్భవతి అయిన మహిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. అప్పుడు వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. వారి ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా`లో మే 7న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు.
తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా` క్వాలిటీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు నేరుగా అందిస్తోంది. గ్రిప్పింగ్ కథనం, వైవిధ్యమైన కథాంశం ఉన్న చిత్రాలను ఆహా నేరుగా తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తుంది. `థాంక్యూ బ్రదర్` చిత్ర ట్రైలర్‌ను స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచే కాదు.. రెబల్‌స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్, వెర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి సహా నెటిజన్స్ నుంచి చాలా మంచి రస్పాన్స్ వచ్చింది. ఆసక్తి కరంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎగ్జయిటింగ్ క్లైమాక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సరైన పాళ్లలో ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం రూపొందింది.