ఈరోజుల్లో నిజజీవిత కథలపై చిత్రాలు తెరకెక్కుతున్న కాలం ఇది.
ఇక అదే కోవలో ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ పైన ఒక చిత్రం రూపొందనుంది. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పేరుతో ఈ చిత్రానికి పెట్టారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానికి ఉండగా ఆయనకీ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు ఆయన పై రాసిన పుస్తకం- ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ద్వారా ఈ చిత్రం తీయనున్నారు.
ప్రముఖ నటుడైన అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించనున్నాడు. దీనికి విజయ్ రత్నాకర్ దర్శకత్వం వహిస్తుండగా హన్సల్ మెహతా స్క్రీన్ప్ ప్లే సమకూరుస్తున్నాడు.
ఈ చిత్రం గురించిన ఫస్ట్ లుక్ బయటకి రాగానే ఆడియన్స్ లో చర్చ మొదలయ్యింది. చూద్దాం.. రిలీజ్ అయ్యాక ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.