లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) షూటింగ్ పూర్తి - త్వరలో ప్రేక్షకుల ముందుకు

మరిన్ని వార్తలు

పవన్ కేతరాజు దర్శకత్వంలో రూపొందుతున్న "లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)" చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ చిత్రాన్ని మణీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డిలు నిర్మిస్తున్నారు. శ్రీహర్ష మరియు కషిక కపూర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎస్.పి. చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్ వంటి ప్రఖ్యాత నటులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ, "కొడుకుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం 'లైఫ్' కథాంశం. ఈ చిత్రం పూర్తిగా కాశి బ్యాక్‌డ్రాప్లో సాగుతుంది, శివతత్వాన్ని ప్రస్తావిస్తూ సున్నితమైన మానవీయతను ప్రతిబింబిస్తుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించాం," అని అన్నారు. శ్రీహర్షకి ఇదే తొలి చిత్రం అయినప్పటికీ, ఆయన ప్రతిభకు మెచ్చుకున్నారు. తండ్రి పాత్రలో ఎస్.పి. చరణ్ గారి అద్భుత నటన సినిమాకి పెద్ద బలంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.


సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు దృశ్యాలతో ఈ చిత్రానికి అద్భుతమైన విజువల్ ట్రీట్ కలిగిందని, మణిశర్మ ఇచ్చిన సంగీతం సినిమాకి మరింత మెరుగు చేసిందని చెప్పారు.


కొరియోగ్రాఫర్ మోయిన్, "ఈ సినిమాలోని ఐదు పాటలకు నేను కొరియోగ్రఫీ చేయడం నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను," అని అన్నారు.


హీరోయిన్ కషిక కపూర్ మాట్లాడుతూ, "ఈ చిత్రంలో తండ్రి-కొడుకుల మధ్య బంధాన్ని చాలా హృద్యంగా చూపించారు. ఈ సినిమాలో నటించడం నాకు గొప్ప అవకాశం. దర్శకుడు పవన్ చెప్పిన కథ చాలా బాగా ఆకట్టుకుంది. ప్రేక్షకులందరికీ ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను," అని అన్నారు.


హీరో శ్రీహర్ష, "లైఫ్ అనేది తండ్రి-కొడుకుల మధ్య ఉన్న బలమైన బంధాన్ని తెలిపే మంచి సినిమా. నేటితో షూటింగ్ పూర్తయ్యింది, సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని నమ్ముతున్నాను," అన్నారు.


చిత్ర నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ, "అరేడు నెలల క్రితం ఈ సినిమా ప్రారంభించాం. నేటితో షూటింగ్ మొత్తం పూర్తయింది. డైరెక్టర్ పవన్ గారు, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ గారు, సంగీత దర్శకుడు మణిశర్మ గారు ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రధానంగా కాశీలో ఈ సినిమా ఎక్కువభాగం చిత్రీకరించబడింది. తండ్రి-కొడుకుల మధ్య బంధాన్ని అద్భుతంగా చూపించాము. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి," అన్నారు.


ఈ కుటుంబకథా చిత్రం ప్రేక్షకులకు తల్లి-తండ్రి బంధం పట్ల భావోద్వేగాలు నింపేలా ఉంటుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.


నటీనటులు : శ్రీహర్ష, కషిక కపూర్, ఎస్. పి. చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, సంధ్య తదితరులు.

టెక్నీషియన్స్ : 

నిర్మాణం : మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్

నిర్మాతలు : కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ మరియు ఏ. రామస్వామి రెడ్డి

రచన, దర్శకత్వం: పవన్ కేతరాజు
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు
సంగీతం : మణిశర్మ
యాక్షన్ : కార్తీక్ క్రౌడర్
ఎడిటర్ : ఆర్. కె
కొరియోగ్రఫీ : మోయిన్
ఆర్ట్ : చిడిపల్లి శంకర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS