గత శుక్రవారం నుండి థియేటర్లు బంద్ అవ్వడంతో సినీఅభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్నది సినీ ఇండస్ట్రీ మేలు కోసమే అని నిర్మాతలు, పంపిణీదారులు చెప్పుకొచ్చారు.
ఇక దాదాపు 6రోజుల పాటు జరిగిన చర్చలు ఒక కొలిక్కి రావడంతో ఇవాల్టి నుండి థియేటర్లు షురు అవుతున్నాయి. అయితే డిజిటల్ ప్రొవైడర్లకి-నిర్మాతలకి మధ్యస్తంగా ఒక ఒప్పందం కుదిరినట్టు సమాచారం అలాగే దీనికి సంబంధించి మరిన్ని చర్చలు రాబోయే రోజుల్లో జరుగుతాయి అని తెలిసింది.
రేపటి నుండి మళ్ళీ సినిమాల విడుదల కానుండడంతో ప్రేక్షకులకి కూడా తమకి బాగా నచ్చిన ఎంటర్టైన్మెంట్ ని పొందనున్నారు. అదే సమయంలో ఈ కొత్త ఒప్పందం ప్రకారం, నిర్మాతలకి-పంపిణీదారులకి కూడా లాభం చేకూరుతుంది అని ఆశించొచ్చు.