చిత్రసీమకు ఇది మరో శుభవార్త. తెలంగాణలో మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈరోజు ఓ జీవోని విడుదల చేసింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకోవచ్చు. దాంతో పాటు కొన్ని షరతుల్ని తెలంగాణ ప్రభుత్వం విధించింది.
* ప్రేక్షకులు మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి.
* షోకీ షోకీ మధ్య థియేటర్ శానిటైజేషన్ తప్పకుండా చేయాలి.
*సినిమా హాళ్ల సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
*భౌతిక దూరం నిబంధనలు తప్పక పాటించాలి.
*హాల్‌లో ఏసీ టెంపరేచర్ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి.