ప‌వ‌న్‌కు ప్రాణ‌గండం... ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప్రాణ గండం ఉంద‌ని, ప్ర‌త్య‌ర్థులు ప‌వ‌న్‌ని టార్గెట్ చేశార‌ని, ఆయ‌న్ని చంప‌డానికి సుపారీ కూడా అందించార‌ని... ర‌క ర‌కాల వార్త‌లు, ఊహాగానాలు చిత్ర‌సీమ‌ని కుదిపేస్తున్నాయి. టీవీ ఛాన‌ల్ అయితే.. ప‌వ‌న్‌కి సుపారీ ఇచ్చిన వైనాన్ని క‌థ‌లు క‌థ‌లుగా ప్ర‌సారం చేస్తోంది. ప‌వ‌న్ చుట్టూ కొంత‌మంది రెక్కీ నిర్వ‌హిస్తున్నార‌ని కొంత‌మంది ఆధారాలు సైతం బ‌య‌ట‌పెట్టారు. ప‌వ‌న్‌ని అంత‌మొందించ‌డానికి ఇది వ‌ర‌కే సుపారీ అందింద‌ని, దాదాపు రూ.250 కోట్ల‌కు బేరం కుదిరింద‌ని... ఇలా సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌కు భ‌ద్ర‌త పెంచాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. రామ్ చ‌ర‌ణ్ త‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బందిని ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు పంపించార‌ని కూడా ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

ఈ వార్త‌ల్లో నిజానిజాలు ఎలా ఉన్నా... ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. ప‌వ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి వ‌చ్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. ప‌వ‌న్ అభిమానుల ముసుగులోనే శ‌త్రువులు తిరుగుతున్నార‌ని, ఎప్ప‌టికైనా వాళ్ల నుంచి ప‌వ‌న్‌కు ముప్పు ఉంద‌ని నిఘా వర్గాలు కూడా చెబుతున్నాయ‌ట‌. ఇవ‌న్నీ.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టే అంశాలే. మ‌రోవైపు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్ చుట్టూ ర‌క్ష‌ణ వ‌ల‌యంగా మార‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. త‌మ గుంపులో ఎవ‌రైనా అనుమానితులు ఉన్నారా? అనే విష‌యాన్ని ఆరా తీస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS