టైగర్‌ నాగేశ్వరరావు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

By iQlikMovies - October 20, 2023 - 14:05 PM IST

మరిన్ని వార్తలు

చిత్రం: టైగర్ నాగేశ్వరరావు

నటీనటులు: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్

దర్శకత్వం: వంశీ


నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్
 
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: ఆర్ మదీ
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు


బ్యానర్స్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
విడుదల తేదీ: 20 అక్టోబర్ 2023

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.25/5

 

స్టూవర్టుపురం నాగేశ్వర‌రావు గురించి తెలుగు ప్రజలకు పరిచయమే. చెప్పి మ‌రీ దొంగ‌త‌నం చేసే గజదొంగగా ఆయనకి పేరుంది. ఆయన గురించి చాలా కథలు కూడా ప్రచారంలో వున్నాయి. ఇప్పుడు రవితేజ టైటిల్ రోల్ లో నాగేశ్వరరావు బయోపిక్ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ తెరపైకి వచ్చింది. రవితేజ చేసిన తొలి బయోపిక్, ఆలాగే ఆయనకి తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి, మరి ఆ అంచనాలని టైగర్ అందుకున్నాడా ? 


కథ: స్టూవర్టుపురం నాగేశ్వర‌రావు( రవితేజ) పేరుమోసిన గజదొంగ. చెప్పి దొంగతనాలు చేయడం అతడి ప్రత్యేకత. అలాంటి నాగేశ్వర‌రావు నుంచి ఏకంగా ప్రధాని మంత్రి కార్యాలయానికి ఓ వార్నింగ్ లెటర్ వస్తుంది. దీంతో ప్రధాని సెక్యురిటీ రంగంలో దిగుతుంది. వారు విచారణ చేస్తున్న క్రమంలో నాగేశ్వర‌రావు గురించి కొన్ని సంచలనమైన విషయాలు తెలుస్తాయి. అసలు ఈ నాగేశ్వర‌రావు ఎవరు? అతడు టైగర్ నాగేశ్వర‌రావు ఎలా అయ్యాడు ? ప్రధాని కార్యాలయానికి వార్నింగ్ లెటర్ ఎందుకు రాశాడు ? ఇవన్నీ తెరపై చూడాలి.  
 

విశ్లేషణ: బయోపిక్స్ అంటే వాస్తవానికి దగ్గరగా వుండే సంఘటనలతో నిజ జీవితం నుంచి పుట్టే కథలే ఎక్కువగా వుంటాయి. ఐతే టైగర్ నాగేశ్వర‌రావు గురించి చాలా ఆసక్తికరమైన నమ్మశక్యం కానీ విషయాలు ప్రచారంలో వున్నాయి. అలాంటి విషయాలకు ఇంకా కమర్షియల్ కోటింగ్ ఇస్తూ తీసిన ఈ చిత్రం అటు బయోపిక్ అటు కమర్షియల్ సినిమా.. రెండిటికి తప్పింది.


టైగర్ నుంచి ప్రధానిమంత్రికి వచ్చిన బెదిరింపు లేఖతో కథ మొదలౌతుంది. మురళి శర్మ పాత్ర ఇచ్చే ఎలివేషన్ తో టైగర్ పాత్రని పవర్ ఫుల్ గానే పరిచయం చేశారు. ట్రైన్ దోపిడి కూడా ఆసక్తికరంగానే వుంటుంది. విలన్ యలమందతో గొడవ, బంగారం కొట్టేయడం.. ఇంతవరకూ బాగానే వుంటుంది. ఎప్పుడైతే హీరోయిన్ పాత్ర పరిచయం అవుతుందో అక్కడి నుంచి సినిమా రొటీన్ ట్రాక్ పట్టేస్తింది. ఇంటర్వెల్ వరకూ మళ్ళీ గ్రాఫ్ పైకి రాదు.  ప్రధాని ఆఫీస్ చుట్టూ అల్లుకునే సన్నివేశాలు కాస్త అతిగా అనిపించినా సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి. 


అయితే టైగర్ సెకండ్ హాఫ్ లో నడిచే రాబిన్ వుడ్ డ్రామా సహనానికి పరీక్షపెడుతుంది. చదువు, ఫ్యాక్టరీ, ఉద్యోగాలు అంటూ నడిచే సన్నివేశాలు అప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన ఎమోషన్స్ కావడంతో ఆ డ్రామా అంతా తేలిపోతుంది. ఆ మొత్తం ట్రాక్ ఎక్కడా కొత్తదనం కనిపించదు. పైగా సెకండ్ హీరోయిన్ రూపంలో మరో రొటీన్ డ్రామా చేరుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లు బాగానే డిజైన్ చేసినప్పటికీ డ్రామాలో కొత్తదనం, వేగం లేకపోవడంతో టైగర్ ప్రయాణం నీరసంగా మారుతుంది, పైగా క్లైమాక్స్ ని సాగదీసిన తీరు ఏ మాత్రం ఆకట్టుకోదు. 


నటీనటులు: ర‌వితేజ న‌ట‌న ఈ సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ. టైగర్ పాత్రలో తన ఎనర్జీ నింపారు. నాగేశ్వర‌రావు పాత్రలో ఒదిగిపోయారు. యాక్షన్ సీన్స్ కూడా బాగా చేశారు. నుపుర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ పాత్రలు అంత బలంగా వుండవు.  అనుప‌మ్ ఖేర్‌, ముర‌ళీశ‌ర్మ‌, నాజ‌ర్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. రేణుదేశాయ్‌ చేసిన హేమ‌ల‌తా ల‌వ‌ణం పాత్ర ప్రభావం చూపలేకపోయింది. య‌ల‌మంద పాత్రలో హ‌రీష్ పేర‌డి, ఆయ‌న కొడుకు కాశీగా సుదేవ్ నాయ‌ర్, సీఐ పాత్రలో జిషూ సేన్ గుప్తా క్రూరమైన విల‌నిజం చూపించారు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. 


టెక్నికల్: జీవీ ప్రకాశ్‌కుమార్ నేపధ్య  సంగీతం బావుంది. కెమెరాపనితనం, ప్రొడ‌క్షన్ డిజైన్ చక్కగా కుదిరింది. సినిమా రన్ టైం మరో ప్రధాన స‌మ‌స్య. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దర్శకుడు వంశీ బయోపిక్ కి కమర్షియల్ కోటింగ్ ఇచ్చే ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదు. 

 

ప్లస్ పాయింట్స్ 

రవితేజ 
యాక్షన్ సీన్స్ 
ఫస్ట్ హాఫ్ 


మైనస్ పాయింట్స్ 

సెకండ్ హాఫ్ 
సాగదీత
లవ్ ట్రాక్  


ఫైనల్ వర్దిక్ట్: రాబరీలు తక్కువ.. డ్రామాలెక్కువ..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS