బాలీవుడ్‌లో 'బాహుబలి' విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలసిందే. ఊహించని స్థాయిలో అక్కడ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఒక అనువాద సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం పట్ల బాలీవుడ్ పరిశ్రమే షాకయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమా రాకపోవడంతో బాలీవుడ్ ప్రేక్షకులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. అయితే 'బాహుబలి'తో పోల్చడం సరికాదుగానీ, ఆ తర్వాత అంతటి విజయం సాధించిన సినిమా తమదేనంటూ 'టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ' చిత్ర దర్శక నిర్మాతలు చెప్పుకుంటున్నారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించాడు ఈ సినిమాలో. 'బాహుబలి' వచ్చిన తర్వాత బాలీవుడ్‌లో హిట్ సినిమాలే రాలేదింతవరకూ అన్న విషయం తెలిసిందే. ఆ లోటుని 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' తీర్చేందుకు ప్రయత్నించింది. ఈ సినిమా నిన్నటికి 120 కోట్లు వసూళ్ళు సాధించడం గమనించదగ్గ అంశం. సామాజిక రుగ్మతగా బహిరంగ మలమూత్ర విసర్జనను భావిస్తూ, కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఆ మహోన్నత కార్యక్రమానికి తమవంతు ఊతంగా 'టాయిలెట్ ఏక్ ప్రేమకథ' చిత్రాన్ని ఆ అంశం మీదనే రూపొందించారు. అక్షయ్‌కుమార్ లాంటి స్టార్ హీరో ఇలాంటి సినిమాల్లో నటించడమే గొప్ప విషయం. ఆ సినిమా ఘనవిజయం సాధించడం ఇంకా గొప్ప విషయంగా పరిగణించాలి. అక్షయ్‌కుమార్ సరసన భూమి పెండేర్కర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.