షూటింగ్ అంటే భ‌య‌ప‌డుతున్న స్టార్ హీరో.

By iQlikMovies - April 06, 2021 - 15:37 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో అగ్ర హీరో ఆయ‌న‌. సినిమాకి దాదాపు 50 కోట్ల పారితోషికం తీసుకుంటుంటాడు. సినిమా, కుటుంబం.. రెండింటికీ త‌గిన ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఇప్పుడా హీరోకి క‌రోనా భ‌యం ప‌ట్టుకుంది. షూటింగ్ అంటేనే.. `చేద్దాం.. చూద్దాం` అంటూ వాయిదా వేస్తున్నాడు. దాంతో ఆయ‌న‌తో సినిమా మొద‌లెట్టిన నిర్మాత‌లు త‌లలు ప‌ట్టుకుంటున్నారు. ఆమ‌ధ్య విదేశాల్లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా.. ఆ షెడ్యూల్ కాన్సిల్ అయ్యింది.

 

ఏప్రిల్ మొద‌టి వారంలో గోవాకి ఆ షెడ్యూల్ షిఫ్ట్ చేశారు. అది కూడా.. ర‌ద్దయిపోయింది. ఇప్పుడు తాజాగా హైద‌రాబాద్ లో షూటింగ్ అన్నా - ఆ హీరో `నో` అంటున్నాడ‌ట‌. సెట్లో ఎవ‌రొస్తారో, ఎవ‌రు వెళ్తారో తెలీదని, వాళ్ల‌కు క‌రోనా ఉంటే, క‌ష్ట‌మ‌ని... అందుకే షూటింగులకు రాన‌ని తెగేసి చెప్పేస్తున్నాడ‌ట‌. అతి త‌క్కువ మంది క్రూతో షూటింగ్ పెడ‌దామ‌న్నా - ఒప్పుకోవ‌డం లేద‌ట‌. దాంతో.. చిత్ర‌బృందం అయోమ‌యానికి గుర‌వుతోంది. క‌రోనా భ‌యాలు రోజురోజుకీ పెర‌గ‌డం త‌ప్ప‌, త‌గ్గ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో... ఆ హీరోతో ఈ సినిమా పూర్తి చేయాలంటే త‌ల‌కు మించిన భార‌మే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS