డ్రగ్స్ టాపిక్ ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమని వణికిస్తుంది. తాజాగా టాలీవుడ్ లోని ప్రముఖులైన ఓ 10 మందికి Excise Enforcement డిపార్టుమెంటు అధికారుల నుండి నోటిసులు వెళ్ళాయి.
ఈ నోటిసులు అందుకున్న వారిలో- డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరోయిన్స్- చార్మీ, ముమైత్ ఖాన్, కెమరామెన్- శ్యామ్ కె నాయుడు, హీరోలు- నవదీప్, తరుణ్, ఆర్ట్ డైరెక్టర్- చిన్నా, సుబ్బరాజు ఉన్నట్టు ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది.
ఇప్పటికే టాలీవుడ్ లో ఒక 10 మంది డ్రగ్స్ వాడుతున్నారు అని మొన్న జరిగిన ‘మా’ ప్రెస్ మీట్ లో ఇండస్ట్రీ పెద్దలే ఒప్పుకున్న సంగతి విదితమే.
ఒక్కసారిగా ఈ పేర్లు అన్ని బయటకిరావడంతో టాలీవుడ్ తో సహా తెలుగు సినిమా అభిమానులు సైతం షాక్ కి గురవుతున్నారు.