ముఖ్యంగా హీరోయిన్స్ అంటే ఎప్పుడూ ఫ్యాషన్‌ని ఫాలో చేస్తూ ఉండాలి. సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించడమే కాదు. బహిరంగా వేడుకల్లో కూడా డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉండాలి. అందుకే ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్‌ని బాగా ఫాలో చేస్తోంది. ఆమె హాజరవుతోన్న ఆడియో ఫంక్షన్స్‌కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో అందరి చూపును తన వైపుకి తిప్పుకుంటోంది. ఆమె అందాన్ని డిఫరెంట్ షేడ్స్‌లో క్లిక్‌మనిపించకుండా ఉండలేకపోతున్నారు ఫోటో గ్రాఫర్లు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఆమెకి బాగా సూటవుతాయి. తన సూచనలు, సలహాల మేరకు మరింత అందంగా తన టేస్ట్‌కి తగ్గట్లుగా తన కాస్టూమ్స్ డిజైన్ చేయించుకుంటోంది రకుల్. అంతేకాదు డ్రస్సు వేసేసుకున్నామంటే కాదు. అది మన ఫిజిక్‌కి కరెక్ట్‌గా సెట్ అవ్వాలి. అప్పుడే ఆ డ్రెస్సుకి అందం, విలువ అని రకుల్ చెబుతోంది. అందుకే అలాంటి డిజైన్స్‌నే రకుల్ సెలెక్ట్ చేసుకుంటానంటోంది. తాజాగా 'విన్నర్' సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి విచ్చేసిన ఈ ముద్దుగుమ్మ తన అందమైన కాస్టూమ్‌తో ఫ్యాన్స్‌ని అలరించింది. ఫ్యాన్స్‌నే కాదు, సినీ ప్రముఖులందర్నీ కూడా బాగా ఎట్రాక్ట్ చేసేసింది. రకుల్‌కి అందమే కాదు. అంతకన్నా అందంగా మాట్లాడే టాలెంట్ కూడా ఉంది. అందుకే తన క్యూట్ క్యూట్ మాటలతో అంత మందిని ఫ్రెండ్స్‌ని చేసేసుకుంది ఇండస్ట్రీలో. అదే రకుల్ అంటే.