4 సినిమాలున్నా.. రూ.100 కోట్లు దాట‌లేదా?

మరిన్ని వార్తలు

సంక్రాంతి అంటే.. బాక్సాఫీసు హోరెత్తిపోవాల్సిందే. స్టార్‌హీరోల సినిమాలు వ‌రుస‌గా విడుద‌ల అయ్యేసీజ‌న్ ఇది. రోజు కో పెద్ద సినిమా థియేట‌ర్లో కొలువు తీరుతుంది. సినిమాల వ‌ర‌కూ ఇంత మంచి సీజ‌న్ మ‌రోటి ఉండ‌దు. గ‌త సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో రెండూ క‌లిసి దాదాపు 400 కోట్లు వ‌సూలు చేశాయి. మొత్త‌మ్మీద సంక్రాంతికి 250 నుంచి 300కోట్ల బిజినెస్ జ‌రిగింది.

 

ఈ సంక్రాంతికీ 4 సినిమాలొస్తున్నాయి. కానీ ఎంత చూసినా 100 కోట్ల బిజినెస్ జ‌ర‌గ‌లేదు. క్రాక్‌, రెడ్, అల్లుడు అదుర్స్‌, మాస్ట‌ర్‌.. ఈ నాలుగు సినిమాలూ ఈ సంక్రాంతికి వ‌చ్చేస్తున్నాయి. ఈనాలుగు సినిమాల మొత్తం మార్కెట్ 100 కోట్లు దాట‌లేదు. ర‌వితేజ ఫుల్ లాస్ లో ఉన్నాడు. త‌న సినిమాలేవీ ఆడ‌డం లేదు. అందుకే త‌న బిజినెస్ 14 కోట్ల‌కు ప‌రిమితం అయ్యింది. మిగిలిన మూడు సినిమాలూ క‌లిపితే 50 నుంచి 70 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఎలా చూసినా 100 కోట్ల లోపే. దానికి కార‌ణం... 50 శాతం ఆక్యుపెన్సీనే.

 

స‌గం టికెట్లే అమ్ముకునే ఛాన్స్ ఉండ‌డంతో.. బయ్య‌ర్లు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. పైగా క్రాక్‌, రెడ్ సినిమాలు ఎక్కువ‌గా ఓన్ రిలీజ్ బేసెస్ మీద విడుద‌ల అవుతున్నాయి. అందుకే..ఇంత త‌క్కువ మార్కెట్ జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి. ఓటీటీ హ‌క్కులు కూడా క‌లుపుకుంటే మ‌రో 100 నుంచి 150 కోట్ల మార్కెట్ ఉన్న‌ట్టే. ఆ లెక్క‌న చూసుకుంటే మాత్రం కాస్త బెట‌ర్ రిజెల్ట్ వ‌చ్చిన‌ట్టు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS