67 సినిమాల్లో మూడే హిట్లు

మరిన్ని వార్తలు

2021 టాలీవుడ్ క్యాలెండ‌ర్లో అప్పుడే మూడు నెల‌లు గ‌డిచిపోయాయి. సంక్రాంతి నుంచి.. సినిమాల జోరు మొద‌లైంది. అప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ ధాటిగానే కొన‌సాగుతోంది. ఈ మూడు నెల‌ల కాలంలో ఏకంగా 67 సినిమాలొచ్చాయి. అంటే.. నెల‌కు 22. ఈ మూడు నెల‌ల్లో టాలీవుడ్ చ‌వి చూసిన సూప‌ర్ హిట్లు. మూడంటే... మూడు. అవే.. క్రాక్‌, ఉప్పెన‌, జాతిర‌త్నాలు. డ‌బ్బింగ్ సినిమా... మాస్ట‌ర్ ఓకే అనిపించుకుంది.

 

న‌రేష్ న‌టించిన `నాంది`కి ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లు ల‌భించాయి. ప్ర‌దీప్ హీరోగా న‌టించిన `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా` అనూహ్య‌మైన ప్రారంభ వ‌సూళ్లు ద‌క్కించుకుంది. `జాంబీ రెడ్డి` లాభాల బాట ప‌ట్టింది. క్రాక్ ని మిన‌హాయిస్తే.. పెద్ద హీరో సినిమా ఏదీ.. టాలీవుడ్ లోకి రాలేదు. ఏప్రిల్ నుంచి ఆ హ‌డావుడి మొద‌లు కాబోతోంది. ఉప్పెన 50 కోట్ల మైలు రాయిని అందుకోవ‌డం 4 కోట్ల‌తో తీసిన జాతి ర‌త్నాలు ఏకంగా 40 కోట్లు తెచ్చుకోవ‌డం ఈ మూడు నెల‌ల్లో సంభ‌వించిన మ‌హ‌త్త‌ర విష‌యాలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS