అప్పుడు టఫ్‌ కాప్‌ ఇప్పుడు టఫ్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు

అనసూయ పేరు చెప్పగానే ముందుగా అందరికీ 'క్షణం' సినిమాలోని టఫ్‌ కాప్‌ గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా గుర్తుండిపోయే పాత్రలో నటించింది అనసూయ. బుల్లితెరపై హాట్‌ హాట్‌గా గ్లామర్‌ పండించేసే ఈ భామ వెండితెరపై తొలి సినిమాతోనే తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఆ తర్వాత నాగార్జున హీరోగా రూపొందిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగ్‌తో ఆడి పాడి సందడి చేసింది. సాయి ధరమ్‌ తేజ హీరోగా వచ్చిన 'విన్నర్‌' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. 'సూయా సూయా' అంటూ అనసూయ ఆడి పాడిన ఆ సాంగ్‌ అప్పట్లో ఓ సంచలనం అని చెప్పక తప్పదు.

ఈ బ్యూటీ ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్‌ రోల్‌లో కనిపించడానికి సిద్ధమయ్యింది. అదే 'మిసెస్‌ శ్రేష్ట జయరామ్‌'. ఇదొక టఫ్‌ జర్నలిస్ట్‌ పాత్ర. టఫ్‌ జర్నలిస్ట్‌ అంటే ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌ అన్న మాట. 'గాయత్రి' సినిమాలో ఈ పాత్ర అనసూయకు దక్కింది. మోహన్‌బాబు నిర్మిస్తూ నటిస్తోన్న చిత్రమిది. ఈ సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కో తరహా ప్రత్యేకతను సంతరించుకున్న సంగతి తెలిసినదే. మెయిన్‌ రోల్‌లో చేస్తోన్న మోహన్‌బాబు దగ్గర్నుంచి, సినిమాలోని ప్రతి పాత్రకీ ప్రత్యేకత ఉంటుందని ఒక్కో పాత్రని పరిచయం చేస్తున్న తీరుని బట్టి అర్థమవుతోంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇదో కొత్త తరహా చిత్రమని చిత్ర దర్శక నిర్మాతలు ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేశారు.

ఆ కొత్తదనం ఏంటి? అన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అనసూయ పాత్ర విషయానికొస్తే, ఈ పాత్ర సినిమాలో అత్యంత కీలకమైనదట. టఫ్‌ కాప్‌గా 'క్షణం' సినిమాలో ఎలాగైతే అనసూయ తన నటనతో సత్తా చాటిందో, అంతకు మించి స్టైలిష్‌గా ఈ ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌ పాత్రలో అనసూయ మెరిసిపోనుందని సమాచామ్‌. లుక్‌ చూస్తోంటేనే ఈ పాత్రను దర్శకుడు ఎంత బాగా డిజైన్‌ చేశాడోనన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు అనసూయ న్యూస్‌ ప్రెజెంటర్‌గా పనిచేసింది. ఆ అనుభవంతోపాటు, అనసూయ స్టైలిష్‌ అప్రోచ్‌ ఈ పాత్రకి అదనపు గ్లామర్‌ అద్దిందని చెప్పవచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS