త్రిష ఈ మధ్యనే ఒక సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
అదేంటంటే- కొన్నేళ్ళ క్రితం త్రిష-విక్రమ్ జంటగా నటించిన సామి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ని ప్లాన్ చేయడం అందులో విక్రమ్ కి జంటగా త్రిష & కీర్తి సురేష్ ని ప్రధాన తారాగణంగా తీసుకున్నారు. అయితే ఉన్నట్టుండి త్రిష ఈ చిత్రం నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. దీనికి గల కారణాలు తెలియనప్పటికీ, ఇలా అకస్మాత్తుగా త్రిష తప్పుకోవడాన్ని ఫిర్యాదు చేస్తూ సదరు నిర్మాత తమిళనాడులోని నిర్మాతల మండలిని ఆశ్రయించాడు.
ఇక దీనికి త్రిష స్పందిస్తూ- ఈ చిత్ర షూటింగ్ లో తాను ఇప్పటివరకు పాల్గొనలేదు అని అలాగే తనకి ఈ సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్ ని సైతం వెనక్కి ఇచ్చేస్తాను అని ప్రకటించింది.
షూటింగ్ లో పాల్గొనక ముందే చిత్రం నుండి తప్పుకోవడం అనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని అంతేతప్ప షూటింగ్ మధ్యలో వెళ్ళిపోలేదు అని వివరణ ఇచ్చింది.