త్రిషపై అందుకే అంత అభిమానం.!

By Inkmantra - February 17, 2020 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

రెండు దశాబ్ధాలుగా చిత్ర సీమను సక్సెస్‌ఫుల్‌గా ఏలుతోన్న ముద్దుగుమ్మ త్రిష. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ సినిమాపై పక్కా డెడికేషన్‌తో వ్యవహరిస్తూ ఉంది త్రిష. సీనియర్‌ హీరోయిన్‌ అన్న గర్వం ఎక్కడా చూపించదనీ ఆమె సన్నిహితులు, టెక్నీషియన్లు చెబుతూ ఉంటారు. ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌ మెచ్చే హీరోయిన్‌గా త్రిషకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. అందుకే ఇన్నేళ్లు ఆమె కెరీర్‌కి ఢోకా లేదు. హీరోయిన్‌గా స్టార్‌ హీరో సరసన నటిస్తూనే, మరోవైపు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తోనూ సందడి చేస్తోంది. ఎప్పుడూ త్రిష చేతిలో ఐదారు ప్రాజెక్టులు ఉండేలా చూసుకుంటుంది.

 

ప్రస్తుతం తమిళంలో ‘రాంగి’ సినిమాలో నటిస్తున్న త్రిష, త్వరలో టాలీవుడ్‌లోనూ సత్తా చాటనుంది. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ ఛైర్‌ని అధిరోహించిన త్రిషకు త్వరలో మళ్లీ ఆ భోగం వరించేలానే ఉంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీ ఎంట్రీతో చిరంజీవినే కాదు, మిగిలిన సీనియర్‌ హీరోల దృష్టినీ త్రిష బాగా ఆకర్షిస్తోందట. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు వెంకటేష్‌, నాగార్జున, బాలయ్య తమ తమ సినిమాలతో ఫుల్‌ యాక్టివ్‌గా ఉన్నారు. కానీ, వీరి సరసన రొమాన్స్‌ చేసే ముద్దుగుమ్మలే కరువయ్యారు. ఆ ప్లేస్‌ని రీ ప్లేస్‌ చేసేందుకే త్రిష టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తోందనుకోవాలి. ఒకవేళ అదే జరిగితే, మళ్లీ టాలీవుడ్‌లో త్రిష విజయ కేతనం ఎగురవేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS