'అల వైకుంఠపురములో' తర్వాత త్రివిక్రమ్ నుండి మరో సినిమా రాలేదు. కరోనా లాక్ డౌన్ ఒక కారణమైతే హీరో, స్క్రిప్ట్ మరో రెండు కారణాలు. 'అల వైకుంఠపురములో' తర్వాత మహేష్ బాబు సినిమాని ఫిక్స్ చేసుకున్నారు త్రివిక్రమ్. అప్పటి నుండి మహేష్ కథపైనే కూర్చున్నారు. కథ పూర్తి చేయడానికి అయనకి దాదాపు ఏడాది పట్టింది. త్రివిక్రమ్ ఏడాది కాలం స్క్రిప్ట్ కి వెచ్చించడం ఈ మధ్య కాలంలో జరగలేదు. ఆయన కథ ఆరు నెలల్లో పుర్తయిపోతుంటుంది.
కానీ సారి మహేష్ కోసం దాదాపు ఏడాది కాలం స్క్రిప్ట్ పై కూర్చున్నారు. తర్వాత మహేష్ కోసం ఎదురుచూశారు. సర్కారు వారి పాట కూడా పాండమిక్ లో చిక్కుకొని బయటికి రావడానికి రెండేళ్ళు పట్టింది. ఈ గ్యాప్ లో భీమ్లా నాయక్ తో హరిక హాసిని నిర్మించిన కొన్ని చిత్రాల కథలని పర్వవేక్షించించారు త్రివిక్రమ్. ఎట్టకేలకు మహేష్ సినిమా కథని పక్కాగా పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ కథ వుండబోతుందని సమాచారం.
ఈ చిత్రానికి కూడా 'అ' అనే సెంటిమెంట్ ప్రకారం టైటిల్ పెడతారని ప్రచారం జరుగుతుంది. ఐతె ఇప్పటివరకూ ఎలాంటి టైటిల్ ఫైనల్ కాలేదు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.