త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార‌ర్... క‌థేమిటి?

మరిన్ని వార్తలు

హీరోల్ని దృష్టిలో ఉంచుకొని క‌థ‌లు రాసుకోవ‌డం ఒక ప‌ద్ధ‌తైతే, క‌థ రాశాక‌....దానికి త‌గిన హీరోల్ని వెదుక్కొనే ప్రోసెస్ మ‌రోటి. అగ్ర ద‌ర్శ‌కులు సాధార‌ణంగా మొద‌టి ప‌ద్ధ‌తినే ఫాలో అవుతారు. త్రివిక్ర‌మ్ మాత్రం రెండూ చేస్తాడు. అందుకే అత‌న్నుంచి `అ.ఆ`లాంటి సినిమాలొచ్చాయి. అగ్ర హీరోల‌తో సినిమాలు చేసే స‌మ‌యంలో నితిన్‌తో ప్రాజెక్ట్ చేయాల్సిన ప‌నిలేదు త్రివిక్ర‌మ్ కి. కానీ... `అ.ఆ` క‌థ నితిన్‌కి సూట‌వుతుంద‌ని అనిపించ‌డంతో.. నితిన్ తో ఆ సినిమా ప‌ట్టాలెక్కించాడు. మంచి హిట్ కూడా అందుకొన్నాడు. ఆ స‌మ‌యంలోనే నానితోనూ త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేస్తార‌ని వార్త‌లొచ్చాయి. సినిమాకీ, సినిమాకీ మ‌ధ్య‌ త్రివిక్ర‌మ్ కి ఎక్కువ గ్యాప్‌లు రావ‌డం స‌హజంగా జ‌రిగే విష‌య‌మే. ఇలాంట‌ప్పుడే... ఓ మీడియం సైజు ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కిస్తే బాగుంటుంద‌ని త్రివిక్ర‌మ్ భావించేవాడు. ఆయ‌న ద‌గ్గ‌ర ఓ క‌థ కూడా రెడీగా ఉంది. అది నానికి ప‌ర్‌ఫెక్ట్ గా సరిపోతుంది. ఆ టైమ్ లోనే నానికి త్రివిక్రమ్ ఈ క‌థ వినిపించాడు కూడా.

 

అయితే స‌మ‌స్య ఎక్క‌డ వ‌చ్చిందంటే... ఇది సోలో హీరో క‌థ కాదు. ఇది మ‌ల్టీస్టార‌ర్ సినిమా. నానితో పాటుగా మ‌రో హీరో కూడా కావాలి. శ‌ర్వానంద్‌, నితిన్‌, నాగ‌శౌర్య‌.. ఇలా యంగ్ హీరోలైతే ఆ క‌థ‌కు బాగుంటుంది. త‌మిళం నుంచి కార్తి, ఆర్య లాంటి హీరోల పేర్లూ ప‌రిశీలించారు. కానీ.. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ``త్రివిక్ర‌మ్ నాతో ఓ సినిమా చేస్తాన‌ని చెప్పారు. కానీ.. కుద‌ర్లేదు. త‌ప్ప‌కుండా ఫ్యూచ‌ర్‌లో ఓ సినిమా చేస్తాం. అది నా కెరీర్‌ని మ‌లుపు తిప్పే ప్రాజెక్టు అవుతుంది`` అని ఈమ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాని. త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర ఆ మ‌ల్టీస్టారర్ స్టోరీ ఇంకా ఉంది. కాక‌పోతే.. త‌న దృష్టి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి హీరోల‌పై, అలాంటి క‌థ‌ల‌పై ఉంది. దాంతో మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మే. కాక‌పోతే.. ఈ క‌థ‌ని వేరే ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టి, సినిమాగా చూడాల‌న్న‌ది త్రివిక్ర‌మ్ ఆలోచ‌న‌. అలాగైనా స‌రే, త్రివిక్ర‌మ్ క‌థ బ‌య‌ట‌కు వ‌స్తుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS