ఆ హీరోలని లైన్ లో పెట్టిన త్రివిక్రమ్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో త్రివిక్రమ్ అంటే ఒక బ్రాండ్. త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేయగానే సినీప్రియులకి ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అని ఎదురు  చూస్తారు. త్రివికమ్ పంచ్ డైలాగ్స్, జీవిత సత్యాలు సినిమా అయ్యాక కూడా  వెంటాడుతూనే ఉంటాయి. భారీగా నోరు తిరగకుండా, గుక్క తిప్పుకోకుండా చెప్పేటట్టు ఉండవు ఆయన డైలాగ్స్, చిన్న పిల్లలు కూడా సందర్భాను సారం వాడేటట్లు క్యాచీగా ఉంటాయి. థియేటర్స్ లో యావరేజ్ అనిపించుకున్న సినిమాలు స్మాల్ స్క్రీన్ పై హైయెస్ట్ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. టాలీవుడ్ హీరోలు త్రివిక్రమ్ సినిమాల్లో నటించటానికి ఉవ్విళూరుతున్నారు. కానీ గురూజీ కొందరికే అవకాశం ఇస్తున్నాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. 


నితిన్, ఎన్టీఆర్ లతో ఒక్కో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. లేటెస్ట్ గా  మహేష్ బాబు హీరోగా  గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శల పాలయ్యాడు. త్రివిక్రమ్ మార్క్ సినిమా లా లేదని, కనీసం గుర్తు పెట్టుకోవాల్సిన డైలాగ్స్ కూడా లేవని ట్రోల్ చేసారు. దీనితో త్రివిక్రమ్ నెక్స్ట్ బన్నీతో చేయబోయే సినిమా ఆగిపోయిందని రకరకాల వార్తలు వినిపించాయి. కానీ త్రివిక్రమ్ ఇప్పుడు ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాడని టాక్.                     


గుంటూరు కారం సినిమా టైమ్ లో బన్నీతో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. ఆ మూవీ ఆగిపోలేదని, బన్నీ పుష్ప 2 కంప్లీట్ చేసాక ఈ మూవీ మొదలవుతుందని సమాచారం. ఇది కాక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో త్రివిక్రమ్ ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కించే దశగా చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో  త్రివిక్రమ్ ఒక సినిమా చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు చెర్రీ, త్రివిక్రమ్ సినిమా రాలేదు. మెగా ఫాన్స్ వీరి కాంబో కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళకి వారి కల నెరవేరనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS