బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెల్లా అందాన్ని వర్ణించడానికి కవుల వద్ద సాహిత్యం కూడా కరువయిపోతుందేమో. అంతటి అందం ఆమె సొంతం. గ్లామర్ ప్రపంచంలో ఎందరో అందగత్తెలయా. అందరిలోనూ ఊర్వశి అందం వేరయా.. 'హేట్ స్టోరీ 4'లో ఊర్వశీ రౌతెల్లా అందాలకు పిచ్చెక్కిపోయింది యవతరం. ఆమె పుట్టించిన హీటుకు శీతాకాలం కూడా ఎండాకాలమైపోయిందంటే అతిశయోక్తి కాదేమో. అలా ఓ సెన్సేషన్ అయ్యింది ఆ సినిమాతో ఊర్వశీ రౌతెల్లా. అందగత్తెలందరూ హీరోయిన్స్‌గా రికార్డులు సృష్టించేయాలనేం లేదు. అలా రేస్‌లో వెనకడిపోయింది ఊర్వశి. బాలీవుడ్లో ప్రస్తుతం ఒకటీ అరా చిత్రాల్లో నటిస్తోంది.
ఛాన్స్ వస్తే, సౌత్ సినిమాలోనూ అమ్మడు తన అందాలకు పదును పెట్టాలనుకుంటోందట. అయితే, ఈ సుందరాంగికి తగ్గ పాత్రల కోసం మన దర్శక, నిర్మాతలు యజ్ఞాలే చేయాలేమో. ఇకపోతే నెట్టింట్లో ఈ భామ సొగసులకు బాగానే ఫాలోయింగ్ ఉంది. గ్లామర్‌కి గ్లామర్, స్టైలింగ్‌కి స్టైలింగ్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఊర్వశి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ ఒకటి వైరల్ అయ్యింది. బ్లాక్ అండ్ బ్లాక్ షార్ట్ మిడీలో హెయిర్‌ని అలా పట్టుకుని ఇచ్చిన స్టైలింగ్ సింప్లీ సూపర్బ్.