ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య పద్మావతి ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె కాన్సర్తో బాధ పడుతూ, బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం 8 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే... సినీ ప్రముఖులు బసవతారకం ఆసుపత్రికి వెళ్లి ఉత్తేజ్ ని పరామర్శించారు.
చిరంజీవి, జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. ఉత్తేజ్ - పద్మావతి దంపతులకు ఇద్దరు కూతుర్లు. అందులో ఓ అమ్మాయి చేతన ఓ సినిమాలో కథానాయికగా నటించింది. ఉత్తేజ్ స్థాపించిన మయూఖ యాక్టింగ్ స్కూల్ బాధ్యతల్ని పద్మావతి చూసుకునేవారు.