వైష్ణవ్ తేజ్ అరంగేట్రంతోనే అదరగొట్టేశాడు. తొలి సినిమానే 50 కోట్ల మైలు రాయికి చేరిపోయింది. ఈ సినిమాతో కృతి శెట్టి జాతకమే మారిపోయింది. దర్శకుడు బుచ్చిబాబుకి మంచి డిమాండ్ వచ్చేసింది. ఇలా ముగ్గురు జీవితాల్ని మార్చేసింది ఉప్పెన. బాక్సాఫీసు దగ్గర విజయ ఢంకా మెగించిన ఉప్పెన ఇప్పుడు ఓటీటీలో విడుదల అవ్వడానికి రెడీ అయిపోయింది.
నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా ని ఏప్రిల్ 14 నుంచి చేసేయొచ్చు. నిజానికి ఉప్పెన విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి తీసుకొచ్చేద్దామనుకున్నారు. కానీ నిర్మాతల విన్నపంతో.. నెట్ ఫ్లిక్స్ మరో నెల రోజుల పాటు ఆగింది. ఇటీవలే ఉప్పెన 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే.. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాని ప్రదర్శించుకోవడానికి నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు సినిమాలు తక్కువ. అందులో హిట్ సినిమాలు ఇంకా తక్కువ. ఉప్పెన రాకతో... నెట్ ఫ్లిక్స్ తెలుగు విభాగానికి ఓ ఊపు రావడం ఖాయంగా కనిపిస్తోంది.