వ‌కీల్ సాబ్.. రిక‌వ‌రీ సాధ్యమేనా?

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టామినా ఏమిటో.. `వ‌కీల్ సాబ్` లెక్క‌లు చూస్తే అర్థ‌మైపోతోంది. `అజ్ఞాత‌వాసి`లాంటి డిజాస్ట‌ర్ త‌ర‌వాత‌.. చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియల్ సినిమా కాదు. పైగా రీమేక్‌. అయినా స‌రే.. భారీ స్థాయిలో బిజినెస్ జ‌రిగింది. థియేట‌రిక‌ల్, నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ అన్నీ క‌లిపి దాదాపు 150 కోట్ల‌కు ఈ సినిమాని అమ్మేశారు. థియేట‌ర్ల నుంచి 90 కోట్లు వ‌స్తే త‌ప్ప రిక‌వ‌రీ అవ్వ‌దు. ఈ ప‌రిస్థితుల్లో.. 90 కోట్లు రిక‌వ‌రీ చేయాలంటే.. వంద కోట్ల క్ల‌బ్ లో చేరాల్సిందే. మ‌రి ఈ స్థాయిలో రిక‌వ‌రీ సాధ్య‌మేనా? అంటూ ట్రేడ్ పండుతులు లెక్కేస్తున్నారు.

 

ఆంధ్రా లో ఈ సినిమాని ఏకంగా 42 కోట్ల‌కు అమ్మేశారు. నైజాంలో లో ఓన్ రిలీజ్‌. ఆయా ప్రాంతాల నుంచి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. క‌నీసం తొలి మూడు రోజుల్లోనే 60 నుంచి 70 కోట్లు కొల్ల‌గొట్టేయాలి. హిట్ టాక్ తెచ్చుకుని, క‌నీసం వారం రోజుల పాటు హౌస్ ఫుల్ క‌ల‌క్ష‌న్లు తెచ్చుకోవాలి. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ఫ్లాప్ అయితేనే.. తొలి మూడు రోజుల్లో ఈజీగా 50 కోట్లు వ‌చ్చేస్తుంది. అలాంటిది హిట్ టాక్ వ‌స్తే ఆ అంకె రెండింత‌లు అవ్వ‌డం ఖాయం. క‌నీసం వారం రోజులు నిల‌బ‌డినా బ‌య్య‌ర్లు బ్రేక్ ఈవెన్ కి వ‌చ్చేస్తారు. అందుకే చిత్ర‌బృందంతో పాటు, బ‌య్య‌ర్లు కూడా ఈ సినిమా ఫ‌లితంపై ధీమాగా ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS