బాలీవుడ్ కి మరో టాలీవుడ్ డైరక్టర్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి. కమర్షియల్ అంశాలతో పాటు. మెసేజ్ కూడా బేస్ చేసుకుని ఉంటాయి వంశీ సినిమాలు. టాలీవుడ్  సూపర్ స్టార్స్ తో  సినిమాలు తీసి హిట్స్ సాధించిన వంశీ ఇప్పుడు, ఇతర భాషా హీరోలని డైరక్ట్ చేసే పనిలో ఉన్నారు. కారణం తెలుగు హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో లాక్ అయ్యి ఉన్నారు. వరుస ప్రాజెక్ట్స్ తో  రెండు మూడేళ్ళ వరకు బిజీగా ఉన్నారు. అందుకనే పర భాషా స్టార్స్ పై ద్రుష్టి పెట్టారు వంశీ. ఇదివరకే కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తో వారసుడు తెరకెక్కించాడు. ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తరవాత వంశీ పైడి పల్లి నుంచి ఇంకో సినిమా రాలేదు. టాలీవుడ్ దర్శకులు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తూ, నిన్న కాక మొన్న వచ్చిన కొత్తవారు కూడా గుర్తింపు పొందుతుంటే, వంశీ పైడిపల్లి ఇలా ఖాళీగా ఉండటం ఏంటని సినీప్రియులు వాపోతున్న తరుణంలో అదిరిపోయే అప్డేట్ తో వచ్చాడు వంశీ. 


రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ , నాగార్జున లాంటి సూపర్ స్టార్స్ తో వర్క్ చేసిన వంశీ పైడిపల్లి ఇప్పుడు ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాక్. అదీ షాహిద్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరోతో. రీసెంట్ గా షాహిద్ ని కలిసి వంశీ కథ చెప్పారని, కథ నచ్చటంతో షాహిద్ కూడా ఓకే చెప్పినట్టు టాక్ . ఈ సినిమాని దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే  బాలీవుడ్ లో షాహిద్ తో దిల్ రాజ్  'జెర్సీ ' రీమేక్ చేసారు. వంశీ పైడిపల్లి 'ఊపిరి' తప్ప అన్ని సినిమాలకి దిల్ రాజ్ ప్రొడ్యూసర్ కావటంతో  ఈ సారి ఈ త్రయం కలిసి వర్క్ చేయటానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అసలు షాహిద్ ని ఒప్పించింది దిల్ రాజే అని టాక్.   


ఈ మధ్య కాలంలో సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. షారుఖ్ తో  అట్లీ చేసిన జవాన్, రణబీర్ తో యానిమల్ చేసిన సందీప్ వంగా సాలిడ్ హిట్స్ కొట్టారు. మురుగు దాస్, క్రిష్, ప్రభుదేవా లాంటి  సౌత్ వాళ్ళు అక్కడ సత్తా చాటారు. ఈ లిస్టులో ఇప్పుడు వంశీ చేరాడు. బాలీవుడ్ లో మంచి విజయం సాధిస్తే వంశీ అక్కడ బిజీ అవటం ఖాయం . షాహిద్ కి కూడా సౌత్ సెంటిమెంట్. ఇక్కడ హిట్ సినిమాల్ని అక్కడ రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే సౌత్సం డైరక్టర్ సందీప్ వంగా తో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి నేరుగా తెలుగు దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS