వరుణ్ తేజ్ మంచి స్వింగ్‌లో ఉన్నాడు. `గని` హిట్ అవ్వకపోయినా.. వెంట వెంటనే రెండు సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నాడు. ఇటీవలే.. వరుణ్ తన కొత్త సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. నావికాదళం నేపథ్యంలో సాగే సినిమా ఇది. తెలుగు - హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు కథకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
వరుణ్ తేజ్ - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ... ఎక్కడో ఓ చిన్న అనుమానం. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ముందుకు కదులుతోందని టాక్. అక్టోబరు 10 నుంచి ప్రవీణ్ సత్తారు సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ రెండు సినిమాల్నీ వరుణ్ సమాంతరంగా పూర్తి చేస్తాడని సమాచారం. ప్రవీణ్ సినిమాలో వరుణ్ బాడీ గార్డ్ గా కనిపిస్తాడని ఓ వార్త షికారు చేస్తోంది. ఇది ఎంత వరకూ నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.