టైటిల్‌కి తగ్గట్లుగానే లుక్ రిలీజ్ చేశాడు హరీష్ శంకర్. 'వాల్మీకి' అనే టైటిల్‌కి తగ్గట్లుగా సినిమాలో వరుణ్ తేజ్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ ప్రీ టీజర్ కోసం చిత్ర యూనిట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ హంగామాని జస్టిఫై చేసింది ప్రీ టీజర్‌లో వరుణ్ తేజ్ లుక్. పొడుగు జుట్టు, గెడ్డంతో, ఆకర్షణీయమైన కనుబొమ్మలు, కంటి కింద చిన్న గాటు.. మెడలో రుద్రాక్షలు, చేతిలో గన్.. చూస్తుంటే, వరుణ్ తేజ్ వాల్మీకిగా ఏదో అద్భుతం చేసేలానే ఉన్నాడు. ప్రీ లుక్ టీజర్ అంటే, ఏదో హీరోని వెనకి నుండో, సైడ్ యాంగిల్ నుండో చూపిస్తారులే.. అని లైట్ తీసుకున్నారంతా. కానీ, టీజర్ వచ్చాక మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అన్నట్లు నోర్లు మూత పడిపోయాయి.
ఆ రేంజ్‌లో వరుణ్ తేజ్ లుక్ ఆకట్టుకుంటోంది. టీజర్ విడుదలైన క్షణం నుండీ సోషల్ మీడియాలో రెస్పాన్స్ అదిరిపోతోంది. 'డీజె'తో నిరాశపరిచిన హరీష్ శంకర్ 'వాల్మీకి'తో 'గబ్బర్‌సింగ్' తరహా మ్యాజిక్‌ని రిపీట్ చేసేలానే ఉన్నాడు. తమిళ 'జిగర్తాండ'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరో పాత్ర నెగిటివ్ షేడ్స్‌లో ఉండబోతోంది. వరుణ్ లుక్ అదే విషయాన్ని రివీల్ చేసింది. 14 రీల్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ కాగా, తమిళ హీరో అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సెప్టెంబర్ 6న 'వాల్మీకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.