'లోఫర్' సినిమా తర్వాత వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'మిస్టర్'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పబ్లిసిటీ వైపుగా ముందుకు సాగుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ న్యూ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నాడు. వారిలో 'కుమారి 21 ఎఫ్' ఫేం హెబ్బా పటేల్ ఒక భామ కాగా, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి మరో హీరోయిన్గా నటిస్తోంది. వరుణ్ తేజ్ షూటింగ్లో గాయపడిన కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని వర్గాల వారిని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్నీ కలగలిపిన చిత్రమిది. క్లాస్‌గా కనిపిస్తున్నా మాస్‌ని మెప్పించేలా ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా కాక శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వరుణ్ తేజ్ చేయబోతున్న మరో చిత్రం 'ఫిదా'. ఈ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టైనరే. విభిన్న తరహా చిత్రాలను ఎంచుకున్న వరుణ్ తేజ్ ఈ సారి పక్కా లవ్ స్టోరీస్‌తో మెప్పించనున్నాడు. ఏప్రిల్ అంతా మెగా హీరోల సందడితో నిండిపోనుంది. అల్లు అర్జున్ 'డీజె'తో పాటు, పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' కూడా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వారితో పాటు మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ కూడా ఇదిగో నేను కూడా వచ్చేస్తున్నానంటున్నాడు 'మిస్టర్'తో. ఏప్రిల్ 14న ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.