మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రేపు మిస్టర్ గా ధియేటర్లలో సందడి చేయనున్నాడు.
ఈ సందర్భంగా తన అభిమానులతో ఫేస్ బుక్ ద్వారా ప్రత్యేక చాట్ నిర్వహించాడు. ఇందులో భాగంగా కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మెగా మల్టీ స్టారర్ పై తన మనసులోని మాట చెప్పాడు.
తమ కుటుంబంలోని అందరు హీరోలు కలిసి ఒక సినిమాలో కనిపిస్తే అది ఒక పెద్ద మెగా ఫిలిం అవుతుందని అల జరగాలని తాను కోరుకుంటున్నాని చెప్పాడు.
అయితే అలాంటి కథ దొరకాలంటే చాలా కష్టమని ఒకవేళ కనుక కథ తనకు వస్తే తప్పకుండ మెగా మల్టీ స్టారర్ చేస్తానని స్పష్టంచేశాడు.