తొలిప్రేమ టీజర్ గుచ్చుకుందిగా...

మరిన్ని వార్తలు

మెగా అందగాడు వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘తొలిప్రేమ’కి సంబందించిన టీజర్ కొద్ది నిమిషాలు ముందు విడుదల అయింది. వరుణ్ కి జంటగా రాశి ఖన్నా నటిస్తుండగా, వెంకీ అట్లూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇక టీజర్ విషయానికి వస్తే, ఈ చిత్ర కథని ఒకే ఒక్క డైలాగ్ తో బ్యాక్గ్రౌండ్లో సాగిన పాటతో మనకి అర్ధమవుతుంది. ఇంతకి ఆ డైలాగ్ ఏంటంటే-
మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళినా... మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేము....

ఈ డైలాగ్ చాలా మందికి తమ ‘తొలిప్రేమ’ని గుర్తుకుతెస్తుంది. ఇక వెంటనే బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాహిత్యం- తొలిప్రేమా... నీ గుండెల్లో గాయామా... తొలిప్రేమా... నా వల్లే అనకుమా....

ఇక ఈ టీజర్ లో తమన్ అందించిన సంగీతం మనకి కావాల్సిన లవ్ స్టొరీ ఫీల్ ని అందిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకి రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS